Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆమెతో మసాజ్ చేయించుకోలేదు.. ఆ యువ‌తి నాకు బిడ్డ లాంటిది: లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై గ‌జ‌ల్ శ్రీనివాస్

  • ఆమె ఎందుకు ఆరోప‌ణ‌లు చేసిందో నాకు తెలియ‌దు
  • మేమంతా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప‌నిచేస్తాం 
  • నా భుజానికి దెబ్బతగిలింది
  • ఒక రోజు ఫిజీషియన్‌ రాకపోయేసరికి ఆ యువతి మందు రాస్తానని చెప్పింది
ప్రముఖ గజల్ కళాకారుడు 'గజల్' శ్రీనివాస్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఓ యువ‌తి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌ను ఆయ‌న లైంగికంగా వేధించాడంటూ ఆ యువతి చేస్తోన్న ఆరోప‌ణ‌లు హాట్ టాపిక్‌గా మారాయి. గజల్‌ శ్రీనివాస్ కు చెందిన‌ ఆలయవాణి అనే వెబ్‌ రేడియోలో ఆ యువ‌తి ప్రోగ్రామ్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తోన్న‌ నేప‌థ్యంలో గ‌జ‌ల్ శ్రీనివాస్ స్పందించారు.

త‌న‌పై ఆమె ఎందుకు ఆరోప‌ణ‌లు చేసిందో త‌న‌కు తెలియ‌ద‌ని అన్నారు. ఆమెతో తాను మసాజ్ చేయించుకోలేదని, ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. తన భుజానికి దెబ్బతగిలిందని, ఒక రోజు ఫిజీషియన్‌ రాకపోయేసరికి ఆ యువతి మసాజ్‌ చేస్తానని చెప్పిందని అన్నారు. తాను వద్దంటున్నప్పటికీ ఆమే తన భుజానికి మందు రాసిందని తెలిపారు. అంతేగాని తాను చెడు భావనతో మసాజ్ చేయించుకోలేదని చెప్పారు.

ఫిర్యాదు చేసిన ఆ యువ‌తిని తాను ఓ బిడ్డ‌లా చూశానని గజల్‌ శ్రీనివాస్ తెలిపారు. తామంతా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ, ఆ భావ‌న‌తోనే ప‌నిచేస్తామ‌ని, అటువంటిది ఇటువంటి ఆరోప‌ణ‌లు ఎందుకు చేస్తుందో అర్థం కావ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి వీడియోలు, ఆడియోలు వంటి పూర్తి ఆధారాలను బాధితురాలు పోలీసులకు ఇచ్చిన త‌రువాతే ఆయ‌నను అరెస్ట్ చేశారు.   
gajal srinivas
arrest
respond

More Telugu News